భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా.. ప్రసిద్ధి చెందిన శ్రీశైలం మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో ప్రధాన దైవాలు వచ్చేసి.. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా దేవి. ఇక్కడ శివ-శక్తుల పూజలు ఒకే చోట జరగడం విశిష్టత. ఆలయంలో శివకథలు, దేవతామూర్తులు, కళాఖండాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు వెలుగులోకి వచ్చాయి. రాగి రేకులు, పురాతన నాణేలు, శివలింగాలు వెలుగులోకి వచ్చాయి.
సాక్షి గణపతి – యాత్రికుల దశలను సాక్షిగా కాపాడే గణపతి ఆలయం. భక్తుల దర్శనాన్ని కైలాసంలో శివుడికి చెబుతాడని నమ్మకం. చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ క్షేత్రానికి సేవలు అందించారు. ఛత్రపతి శివాజీ మహారాజు కూడా శ్రీశైలంలో నివాసముండి సేవలందించినట్లు చరిత్ర చెబుతుంది.
ఆలయ విశేషాలు ఏంటంటే..
జ్యోతిర్లింగం, శక్తిపీఠం – రెండు మహా పీఠాలూ ఒకేచోట ఉన్న ఏకైక క్షేత్రం. అఖండ దీపం – నిరంతరం వెలుగుతూ ఉండే పవిత్ర దీపం.
నంది విగ్రహం – ఒకే రాయితో చెక్కబడిన, 20 టన్నుల బరువు గల అపూర్వ శిల్పం.
పాండవుల లింగాలు – పాండవులు ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ప్రధాన ఆలయం వెనుక భాగంలో దర్శనమిస్తాయి.
పాగాలంకరణ సేవ – మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరిగే ప్రత్యేక సేవ. ఆలయ విమాన శిఖరంపై త్రిశూలానికి పాగా కట్టి, ఆలయ నందుల కొమ్ములకు కడతారు. ఇది చిమ్మ చీకటిలో మాత్రమే జరుగుతుంది.
నిత్య కైంకర్యాలు – స్వామివారికి, అమ్మవారికి, పరివార దేవతలకు ప్రతిరోజూ శాస్త్రోక్త పూజలు జరుగుతాయి.

